కల్కి మూవీలో నటించనున్న తారక్, నాని.. అసలు నిజం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా తెర‌కెక్కుతుందంటే చాలు మొదటి నుంచే సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు ఆ స్టార్ హీరోలో మూవీలో మరో స్టార్ హీరో కీలకపాత్రలో నటించబోతున్నాడన్న‌ వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఈ వార్తల్లో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. ఇంకొన్నిసార్లు మాత్రం ఇవి రూమ‌ర్లుగా మిగిలిపోతూ ఉంటాయి.

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే  రోల్స్​లో!

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న‌ ఓ సినిమా క‌ల్కి గురించి కూడా అలాంటి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 6ఏళ్ళ‌ నుంచి హిట్ అనే పదానికి దూరంగా ఉన్న ప్రభాస్.. స‌లార్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద హిట్‌ సొంతం చేసుకున్నాడు. ఇక మరికొన్ని సినిమాలతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రభాస్.. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి మూవీలో నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Jr NTR and Nani's unseen photo from a party surfaces on internet; fans go  berserk | PINKVILLA

సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైర‌ల్‌గా మారింది. నాగఅశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ ఇద్దరు న‌టించ‌బోతున్నార‌ట. ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల్లో వాళ్ళ న‌టిస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృష్ణార్జునగా నాని కనిపించబోతున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్‌ రాలేదు. కాగ ఈ మూవీలో అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, త్రిష లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే.