నాని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజునే సరిపోదా శనివారం రిలీజ్..

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Natural Star Nani, Vivek Athreya, DVV Entertainment Pan India Film  Saripodhaa Sanivaaram Launched Grandly

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర ఎప్పుడు చూడని విధంగా వైవిధ్యంగా, సరికొత్త పంథాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో నాని ఇంటెన్స్ రోల్ లో కనిపించాడు.

Saripodhaa Sanivaaram - Wikipedia

ఈ సినిమా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ వివరించారు. ప్రియాంక అరుణ్ మోహన్, సూర్య తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్ గా మురళి.జి.. సంగీత దర్శకుడుగా జోక్స్ బిజీయో వ్యవహరిస్తున్నారు.