‘ జై హనుమాన్ ‘ లో ఆ పాత్రలకు చిరు, మహేష్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..

హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ మైవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ250 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో మరో సినిమాకి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

Prasanth Varma announces HanuMan sequel on Ram Mandir Pran Pratishtha - Hindustan Times

అయితే ఈ సినిమాలో హనుమంతుడు, రాముడు పాత్రలకు టాలీవుడ్ లో స్టార్ హీరోలు చేస్తారని గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరైన ప్రశాంత్ వర్మ.. తన అభిప్రాయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఈ పాత్రలకు స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని వివరించాడు. జై హనుమాన్ మూవీ స్కేల్ చాలా పెద్దది.. ఈ సినిమాలో టాప్ స్టార్ నటించిన ఛాన్సెస్ ఉన్నాయి.. హ‌నుమంతుడు పాత్ర ఎవరు చేసినా హావభావాల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.

Happy Birthday Chiranjeevi: 5 lesser-known facts about Hanuman devotee – India TV

ఆ పాత్ర మనం బయట చూసే హనుమాన్ లాగ అనిపించదు.. ఆయన ఏ రూపంలో అయినా కనిపించవచ్చు.. హనుమాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రెడీగా ఉన్నా.. చూడగానే భక్తితో నమస్కారం చేయాలని భావన కలగాలి. ఆ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి ఉండొచ్చు.. మెగాస్టార్‌కు పద్మ విభూషన్ వచ్చిన తర్వాత నేను కలవలేదు. అన్ని కుదిరితే ఆయనే ఈ పాత్ర చేస్తారు. ఆ విషయం ముందు ఏం జరగబోతుందో ఇప్పుడే చెప్పలేను.. రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేష్ బాబు.

SS Rajamouli's Ramayan: Is this how Mahesh Babu will possibly look as Lord Ram in SS Rajamouli's Ramayan? Fan-art goes viral

ఎందుకంటే సోషల్ మీడియాలో రాముడితో క్రియేట్ చేసిన మహేష్ బాబు ఫోటోలను చూసాం. మా ఆఫీస్ లో కూడా ఆయన ముఖంతో రి క్రియేట్ చూస్తే అది అద్భుతంగా అనిపించింది. ఇక జై హనుమాన్ మూవీ పనులు ఏడాది కిందటే మొదలు పెట్టేసాం.. అని ప్రశాంత్ వ‌ర్మ‌ వివరించాడు. కథ సిద్ధంగానే ఉందని ఎలా తీయాలో అనే అంశంపై ప‌నులు జరుగుతున్నాయని.. విఎఫ్‌ఎక్స్ తో పాటు మిగిలిన వాటిపై క్లారిటీ రాగానే షూటింగ్ మొదలు పెడతా.. వచ్చే సినిమాలలో కూడా నాణ్యత విషయంలో అసలు రాజీపడడం లేదు అంటు వివరించాడు ప్రశాంత్ వ‌ర్మ‌.