ఎన్టీఆర్ “దేవర” లో జాన్వి కపూర్ కి అమ్మగా స్టార్ హీరోయిన్.. కొరటాలకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో..?

ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ లీకై వైరల్ గా మారింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నాడు.

 

అయితే శ్రీకాంత్ కి భార్యగా జాన్వికపూర్ కు అమ్మగా ఈ సినిమాలో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి నటించబోతుందట . గతంలో ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఆమె తారక్ కు జోడిగా నటించింది . ఇప్పుడు అదే తారక్ కు అత్తగా నటించబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

దీనిపై చిత్ర బృందం ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు . కానీ ఈ రోల్లో ప్రియమైన నటిస్తే కెవ్వు కేకే అంటున్నారు జనాలు. అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా సాయి పల్లవి -మృణాల్ ఠాకూర్- రష్మిక మందన్నాల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొన్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ఈసారి వీళ్ల కాంబో ఎలా సెట్ అవుతుందో..??