గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న పవన్ హీరోయిన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ నిశ్చితార్ధలు.. పెళ్లిళ్లు చెప్పకుండా చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం గ్రాండ్గా చెప్పేస్తున్నారు. అది పెళ్లికి ముందు అయినా పెళ్ళికి తర్వాత అయినా .. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే ట్రెండ్ బాగా ముందుకెళ్తుంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కృతికర్బంధా నిశ్చితార్థం చేసేసుకుంది అంటూ కొన్ని రకాల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అయితే ఈ ఫోటోలు చూసిన జనాలు వీరికి నిశ్చితార్థం అయిపోయింది అంటూ అభిప్రాయపడుతున్నారు . అయితే ఎక్కడా కూడా కృతికర్బంధా నిశ్చితార్థం అయినట్లు అఫీషియల్ గా ప్రకటించలేదు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బాలీవుడ్ ప్రేమ జంట కృతికర్బంధ – పుల్కిత్ సామ్రాట్ ప్రేమించుకుంటున్నట్లు డేటింగ్ లో ఉన్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

వీళ్లి కలిసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . అయితే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు రీసెంట్గా కొన్ని ఫోటోలు బాలీవుడ్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ లో వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ సన్నిహితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది . దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఇద్దరు చేతికి ఒకే రకమైన ఉంగరాలు ఉండడం గమనార్హం. దీంతో వీళ్లిద్దరు నిశ్చితార్ధం చేసేసుకున్నారా..? అయితే ఎందుకు చెప్పలేదు.. అంటుంటే మరికొందరు నిశ్చితార్థం సింపుల్ గా చేసుకున్నట్లు ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీనిపై కృతికర్పందా రియాక్ట్ అయితేనే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!