రష్మికకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన తాప్సి.. నేషనల్ క్రష్ పరువు గంగలో కలిసిపాయే..!

నేషనల్ క్రష్ గా.. పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. పై ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ చూసాక జనాలు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . డబ్బు కోసం ఇలాంటి పనులు కూడా చేస్తావా..? అంటూ మండిపడ్డారు . చాలామంది సినీ ప్రముఖులు యానిమల్ సినిమాపై ఫైర్ అవడం గమనార్హం.

ఇది పరమ చెత్త సినిమా అంటూ ట్రోల్ చేశారు . ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమానే 900 కోట్లు క్రాస్ చేసింది. రీసెంట్గా ఈ సినిమాపై హీరోయిన్ తాప్సి పరోక్షకంగా చేసిన కామెంట్స్ రష్మిక గూబ్ గుయ్యమనిపించింది అంటున్నారు జనాలు . “సినిమా ఇండస్ట్రీలో ఉండే నటులకు చాలా గౌరవం ఉంటుంది . ఆ గౌరవాన్ని మనం మన పద్ధతుల ద్వారా మనం చేసే సినిమాలు ద్వారా పాడు చేసుకోకూడదు ..మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం.. నచ్చింది చేసే రైట్ మనకు ఉంది ..ఒకరి ఆప్షన్స్ ని నేను తప్పు పట్టడం లేదు ..నేనైతే యానిమల్ సినిమాలో అవకాసం వస్తే చేస్తుండే దాన్ని కాదు అని చెప్పుకొస్తున్నాను” అంటూ పరోక్షంగా రష్మిక మందన్నా చేసిన పనిని తప్పు పట్టింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హీరోగా రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . 900 కోట్లు కలెక్ట్ చేసింది . టాక్ ప్రకారం సూపర్ డూపర్ అయినా కూడా చాలామంది సినిమాలో బోల్డ్ కంటెంట్ చూసి షాక్ అయిపోయారు..!!