సమంత ఈజ్ బ్యాక్.. ఇక ఒక్కోక్కడి పులుసు కారిపోవాల్సిందే..పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు సమంత మళ్లీ తన వర్క్ పనులను ప్రారంభించింది . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . అప్పటినుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత తెరపై కనిపించలేదు . సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది .

రీసెంట్గా సమంత సిటాడిల్ వెబ్ సిరీస్ కు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించింది. దీనికి సంబంధించి కొన్ని పిక్చర్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. దాదాపు 22 నెలల తర్వాత అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే పోస్ట్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు సమంత ఆరోగ్యం పై కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలను వదిలేసిందని .. ఇక సినిమాల్లో నటిస్తుంది అని ..ఇక ఒక్కొక్కడికి పులుసు కారిపోవాల్సిందేనని.. ఎవరైతే ఆమెను ట్రోల్ చేశారో ఇక వాళ్లకి దబిడి దిబిడే అంటూ ట్రెండ్ చేస్తున్నారు సమంత అభిమానులు.

కాగా హీరోయిన్ సమంత బాలీవుడ్లో మరో వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం కూడా చేయబోతుందట . అలాగే హాలీవుడ్ లోనూ ఒక ఫిలిం కు కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం సమంతకు సినిమా అవకాశాలు రావడం లేదు. ఇది ఆమె కూసింత గట్టిగా ఆలోచించాల్సిన విషయమే..??

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)