సినిమా హిట్ అవ్వదని తెలిసిన సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే.. అంత స్పెషల్ ఎందుకంటే..?

నందమూరి నట‌సార్వ‌భౌమ‌ బొమ్మ తారక రామారావు నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాడు. ఇదే పద్యంలో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాను కూడా ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇది ఎన్టీఆర్ నటించిన చివరి సినిమా. ఈ సినిమాని అగ్ర దర్శక రచయిత బాపు – రమణ రూపొందించాడు. కాగా ఈ మూవీ ఆడదు అని ఎన్టీఆర్కు ముందే తెలిసిన నటించారట. తెలుగులో మహాకవి శ్రీనాథుడి జీవితం గురించి అందరికీ చెప్పాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట.

NTR: నష్టం వచ్చినా పర్వాలేదు | ntr about srinatha kavi sarvabhauma

ఇక ఈ ఆలోచనలు బాపూ – రమ‌ణ‌ల‌కి తెలియజేయగా ఎన్టీఆర్ నిర్ణయానికి బాపు రమణలు బదులిస్తూ.. సాధారణ ప్రేక్షకులకు ఎవరికి శ్రీనాధుడు గురించి పెద్దగా తెలియదు.. అంతేకాదు శ్రీనాథుడి జీవితంలో కూడా అంత ఆసక్తిగా కథ ఏమీ ఉండదు.. దీనిని సినిమాగా తీస్తే ఆర్థికంగా నష్టం వస్తుంది అంటూ వివరించారట. ఇక ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న ఎన్టీఆర్.. అది కష్టమో, నష్టమో తెలిసిన కూడా వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే బాపూ రమణలతో ఎన్టీఆర్.. నష్టం వచ్చిన పర్లేదు ప్రేక్షకులాధ‌ర‌ణ‌ పొందకపోయినా సమస్య కాదు.. మనం శ్రద్ధతో సినిమా తీద్దాం. అందరూ చూడకపోయినా కొందరైనా చూస్తారు. నాకు ఆ తృప్తి చాలు.

Srinatha Kavi Sarvabhoumudu - Wikipedia

శ్రీనాథుడు పాత్ర చేయాలని నా కోరిక కూడా నెరవేరుతుంది.. అంటూ వివరించి సినిమాను మొదలుపెట్టాడట. ముందుగా అంచనా వేసినట్లు ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ లాంటి పవర్ఫుల్ మూవీ లో ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్టీఆర్ ని అలాంటి రోల్ లో చూసిన తర్వాత సడన్ గా ఓ క‌విగా సాఫ్ట్ రోల్ లో ఎన్టీఆర్ ను ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. కాగా ఈ సినిమాలో జయసుధ, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాతోనే స్టార్ కమెడియన్ ఏవీఎస్, గుండు సుదర్శన్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కె.వి మహదేవన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.