ఓరి దేవుడోయ్.. స్టార్ హీరో ఇలాంటి పనులు కూడా చేస్తాడా..? ఫ్యాన్స్ షాక్..!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఎంత సెక్యూరిటీ మధ్య బయటికి వస్తారో మనకు తెలిసిందే . ఒక షాపింగ్ కి వెళ్ళాలి అన్నా.. ఒక ఈవెంట్ కి రావాలి అన్నా.. తమ ఫ్యాన్స్ దగ్గర నుంచే సెక్యూరిటీ కావాలి .. అనుకోని బాడీగార్డ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఏ స్టార్ హీరో కూడా వితౌట్ సెక్యూరిటీ బయటకు రారు . కానీ ఇక్కడ ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది.

 

ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక స్టార్ హీరో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా నిరాడంబరంగా పబ్లిక్ గా రోడ్డుపై తిరుగుతూ ఒక హోటల్లో భోంచేసి ఆటో ఎక్కి సాదాసీదా మనిషిగా వెళ్లిపోయాడు దీనికి సంబంధించిన వీడియో ప్రెసెంట్ వైరల్ గా మారింది . ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి మరెవరో కాదు మలయాళం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫహెద్ ఫజిల్.

పుష్ప మూవీతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన నటుడు . ఆయన సినిమాలు ఎంత చక్కగా ఉంటాయో మనకు తెలిసిందే . రీసెంట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరులో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు . ఈ సినిమాలో ఫహద్ తో పాటు మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాలోని సీన్స్ ప్రొదుటూరు సెంటర్లో షూట్ చేశారు . అక్కడ కొంతమంది ఆడియన్స్ ఆ షూటింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . హోటల్ లో భోజనం చేసిన ఫహద్ అండ్ టీం అక్కడి నుంచి ఓ ఆటో ఎక్కి బయలుదేరారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంత సాదాసీదాగా కనిపిస్తాడా ఫహద్ ఫజిల్ అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . ఏ హీరో కూడా ఇలా చేయడు అంటూ ఆయన ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!