కుమారి ఆంటీ హోటల్ క్లోజ్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలకు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . మరి ముఖ్యంగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ పేరు బాగా వైరల్ అయింది . కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది . సామాన్యులు కూడా అందుబాటులో ఉండే రేట్లతో పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను తనదైన స్టైల్ లో వండి వడ్డిస్తూ ఉంటుంది . సోషల్ మీడియాలో యూట్యూబ్లో కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యింది.

ఆమె ఫుడ్ బిజినెస్ కి సంబంధించిన రీల్స్ వీడియోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా కుమారి ఆంటీ కు ఆ రీల్స్ వల్లే పెద్ద సమస్య వచ్చి పడింది. ఫుడ్ బిజినెస్ బాగా జరుగుతుంది అని ఆనందపడే లోపే కుమారి ఆంటీ కు బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. ట్రాఫిక్ సమస్యల వల్ల ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించాలి అంటూ పోలీసులు ఆమెకు సలహా ఇచ్చారట . అంతేకాదు ఆమె వినకపోవడంతో ఏకంగా ఇప్పుడు అక్కడ ఆమె షాప్ పెట్టుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా పాస్ చేశారట.

ఆమె ఫుడ్ బిజినెస్ కారణంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని పలువురు జనాలకు ఇబ్బంది కలుగుతుంది అని పోలీసులు చెబుతున్నారు . అయితే ఇదంతా ఫేక్ అని ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కుమారి ఆంటీ చేసిన కామెంట్లు వల్లే ఆ బిజినెస్ మూతపడింది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు . పెద్దగా ఆస్తులు లేని కుమారి ఆంటీ కి న్యాయం జరగాలి అని పలు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు . ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం కుమారి ఆంటీ హోటల్ వద్ద సందడి చేసిన సందీప్ కిషన్ కూడా ఆమె బిజినెస్ క్లోజ్ అవ్వడంపై ఫైర్ అయ్యారు . సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కుమారి అంటికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??