చిన్నపిల్లలు రాత్రులు త్వరగా నిద్రపోవడం లేదా.. ఈ ఆహారంతో త్వరగా నిద్రపోతారు

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు చిన్న పిల్లలు చదువులు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు.. దీంతో రోజంతా స్కూల్లో ఉండి మానసిక ఇబ్బంది అనుభవిస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే మైండ్ సెట్ తో ఉండడం వల్ల మెదడుకు చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇదే సమస్యతో రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో నిద్ర భంగం సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి కొంతమంది మొబైల్ కు అలవాటు పడి నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే చిన్నపిల్లలు తొందరగా నిద్రపోవడానికి కొన్ని ఆహార పదార్థాలను అలవాటు చేస్తే సరిపోతుంది. అవి తినడం వల్ల వారిలో మానసిక ప్రశాంతత ఏర్పడి త్వరగా నిద్ర పడుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం..

ఖర్జూరం ఇవి చూడడానికి ఎంత ఆకర్షణీయంగా, రుచులో కూడా అద్భుతంగా ఉంటాయి. మన దేశంలో ఇవి పండక‌ పోవడంతో ధ‌ర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయినా ఖర్జూరాలను చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో సెలీనియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్ మెగ్నీషియంతో పాటు 15 రకాల మినరల్స్.. అద్భుతమైన అమినోయాసిడ్స్, ఫిల్మీ టోలిక్, లినోలేయిక్ లాంటి ఫ్యాటీ యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చేరడం వల్ల మానసిక ప్రశాంత‌త‌ కలిగి నిద్రలేమి సమస్యకు చెక్‌ పెడుతుంది.

అలాగే కివి పండ్లు ఇటీవల మార్కెట్లో సులభంగా దొరుకుతున్నాయి. ఇక కివీ పండ్లను కూడా రోజుకు రెండు చొప్పున పిల్లలకు తినిపించడం వల్ల పిల్లలకు నిద్రలేమి సమస్య తగ్గుతుందని.. ఇవి తినడం వల్ల 42 శాతం ఎక్కువగా నిద్ర పడుతుంది అని సర్వేలు చెబుతున్నాయి. అలాగే రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తీసుకోవడం వల్ల చిన్నారులు బాగా నిద్రపోతారట. ఇక పాలలో ఉండే క్యాల్షియం నిద్రపోయే గుణాలను కలిగిస్తుందని.. ఎముకలకు బలని చెకరుస్తుందని.. నిపుణులు చెప్తున్నారు. కనుక పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా మంచి నిద్ర కోసం పాలను తీసుకోవచ్చు. కోడిగుడ్ల ఆరోగ్యం ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల గుడ్డులో సెరోటోనిన్ అనే పదార్థం శరీరంలోనికి వెళ్లి మంచి నిద్ర కనిపిస్తుంది. ఈ పై ఆహారాన్ని పిల్లలకు పెట్టి మొబైల్ అలవాటును తగ్గిస్తే వారు త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు.