బాలయ్య ” అఖండ 2 ” పై దిమ్మతిరిగే అప్డేట్.. ఊచ కోత మొదలు…!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 పై ఎన్నో అంచనాలు నెలకున్నాయి.

అఖండ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సీక్వెల్లి ఏర్పాటు చేశాడు బోయపాటి శ్రీను. ఏప్రియల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ సీక్వెల్స్ ను షూట్ చేస్తున్నారని టాప్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీల‌క‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అఖండ సినిమా పై నార్త్ లో కూడా బజ్ నడుస్తుంది. ఈ సినిమా కథ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్యని మరో కొత్త గెటప్ లో చూడబోతున్నారంటూ ఇప్పటికే చిత్ర బృందం తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.