భారీ ధరకు అమ్ముడుపోయిన నాచురల్ స్టార్ నాని ” సరిపోదా శనివారం ” డిజిటల్ హక్కులు..!

నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ ” సరిపోదా శనివారం “.

ఈ సినిమాపై నేచురల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దాదాపు 45 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు సమాచారం.

నాని కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ డిజిటల్ రైట్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో ఎస్ ఏ సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.