పవన్ ” ఓజీ ” మూవీ డేట్ కన్ఫామ్.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి మరి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భరత్ సింగ్ పుట్టినరోజు ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు భారతాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే తేదీని పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ ఆశతోనే మరోసారి ఇదే తేదీని ఖరారు చేసుకున్నారట ఈ చిత్ర బృందం.