“ఆ హీరో బూతులు మాట్లాడితే చెవులు మూసుకోవాల్సిందే”..మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్ కి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు హీరోగా చేసి ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు మరోవైపు ఉస్తాత్ అనే షోని కూడా హోస్ట్ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీస్ తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ షో కి వస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా హెల్తీగా జోవియల్ గా మంచు మనోజ్ వచ్చిన స్టార్స్ తో మాట్లాడుతూ ఉంటారు .

రీసెంట్గా ఈ షో కి రవితేజ గెస్ట్ గా హాజరయ్యారు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ మంచు మనోజ్ హ్ఫ్స్ట్ చేస్తున్న షో కి గెస్ట్ గా వచ్చారు . వీరిద్దరి మాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి . ఇద్దరికి ఇద్దరే నాటి ఫెలోస్ చక్కగా అభిమానాలను ఎంటర్టైన్ చేస్తారు . మరి ఇద్దరు ఒకే స్టేజిపై ఉంటే ఆ రచ్చ ఎలా ఉంటుంది ..రచ్చ రచ్చగానే ఉంటుంది . ఇదే క్రమంలో రవితేజ అని కొన్ని ప్రశ్నలు అడిగాడు మంచు మనోజ్ .

మంచు మనోజ్ మాట్లాడుతూ ..”మనమిద్దరం మొదటిసారి ఎప్పుడు కలిశాం అన్నయ్య ..మీకు గుర్తుందా..?” అంటూ అడుగుతాడు . అప్పుడే రవితేజ ఆలోచిస్తూ ఉండగా..” నువ్వేమైనా ఫిగరా..? గుర్తుపెట్టుకోవడానికి అనుకుంటున్నారు కదా ..?”అంటూ సెటైరికల్ గా పంచ్ వేస్తాడు. అనంతరం మరో ప్రశ్న అడుగుతూ ..”ఇండస్ట్రీలో రవితేజ వాడే బీప్ లు ఇంకెవరు మాట్లాడరు అంటారు.. నిజమేనా అంటూ ప్రశ్నించాడు”.

రవితేజ ఓపెన్ గా సమాధానం చెప్పారు . “అందరూ బూతులు మాట్లాడుతారు ..కానీ నేను ఎక్కువగానే ఓపెన్ అయిపోతా” అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ చేశాడు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకటైతే నిజం రవితేజ బూతులు మాట్లాడితే చాలు చెవులు మూసుకోవాల్సిందే . అయితే ఆ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పడం మరింత ట్రెండ్ అవుతుంది. మంచు మనోజ్ రవితేజల మధ్య ఫ్రెండ్షిప్ ఈ షో తో బాగా బయట పడిపోయింది . రవితేజ నటించిన ఈగల్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు..!!