వాట్ : ఆ టాలీవుడ్ హీరోయిన్ రవితేజ విలన్ కు భార్య.. అసలు ఊహించి ఉండరు..?

స్టార్ విలన్ బాబీ సింహ‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ డిస్కో రాజా సినిమాతో టాలీవుడ్ విలన్ గా పరిచయమై ఈ మూవీలో త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేసిన బాబీసింహ.. ఇటీవల కాలంలో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న.. చిన్న పాత్రలో మాత్రమే నటిస్తూ వ‌చ్చిన బాబి.. రవితేజ డిస్కో రాజా సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే బాబీసింహా అంటే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు.. కానీ రవితేజ డిస్కో రాజా మూవీ విల‌న్ అంటే మాత్రం టక్కున గుర్తుకొస్తుంది.

ఇక అందరూ తమిళ నటుడుగా చూసే బాబీ సింహ.. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. అనుకోకుండా ఆయన పేరెంట్స్ తమిళ్ రాష్ట్రంలో కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో వలస వెళ్లి అక్కడ సెటిలైపోవడంతో.. తమిళ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంట్రి ఇచ్చి తక్కువ సమయంలోనే తనదైన యాక్టింగ్ తో ప్రత్యేకమైన ఫేమ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోను వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. గత ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రలో మెప్పించాడు బాబి సింహ. కాగ‌ ప్రస్తుతం ఈ విల‌న్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాబి సింహ భార్య ఏకంగా ఓ తెలుగు హీరోయిన్ అట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా హైదరాబాద్‌ లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రేష్మి మీనన్.. బాబి సింహ భార్య అని తెలుస్తోంది. తర్వాత సాయిరాం నటించిన నేను రకం మూవీ లోను ఈమె హీరోయిన్గా నటించింది. రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక‌ రష్మీ మీనన్ యంగ్ విలన్ బాబి సింహ భార్య అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.