మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బాలయ్య ప్రైవేట్ (వీడియో)..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే . అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ.. ప్రతిపక్ష పార్టీ పై అధికార పార్టీ నిందలు వేసుకోవడం వాళ్లకి సంబంధించిన గత తాలూకా వీడియోలను వాళ్లకు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ట్రోలింగ్ గురి చేస్తున్నారు . ఈ మూమెంట్లో ఇలాంటివన్నీ కామన్ ..కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవబోతున్నాయి . ఇలాంటి మూమెంట్లో ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతూ ఉండడం మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం . కానీ ఈసారి కూసింత ఎక్కువ స్థాయిలో టఫ్ కాంపిటీషన్ నెలకొనడం గమనార్హం.

సర్వేల ప్రకారం 2024 ఎలక్షన్స్ లో టిడిపి అధికారం చేపట్టడం ఖాయం అంటున్నారు జనాలు . అంతేకాదు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా పైగా మళ్లీ జనాలపై దాడులు చేయించడం దౌర్జన్యం గా ఉన్న పింఛన్లు కూడా లాగేయడం జనాలకు ఉన్న గవర్నమెంట్ పై నమ్మకం పోయేలా చేసింది. కాగా రీసెంట్గా టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే బాలయ్యకు కోపం ఎక్కువ . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . అక్కడ పద్ధతులు ఆయనకు నచ్చకపోయినా సరే అరవడం.. కొన్నిసార్లు హ్యాండ్ మిస్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి . అయితే రీసెంట్గా ఒక దళిత కార్యకర్తపై బాలకృష్ణ దాడి చేసినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్.. ఈ వీడియో పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బాలయ్యను తప్పుపడుతుంటే మరికొందరు అక్కడ జరిగిన సిచువేషన్ అర్థం చేసుకోకుండా బాలయ్య ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు . గత రెండు ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య పోటీ చేశాడు. మూడవసారి కూడా అక్కడి నుంచే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .

ఈ క్రమంలోనే పర్యటనలు కూడా చేపట్టారు . అయితే ఒక ఇంట్లో కార్యకర్తలు నేతలతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే బాలయ్యకు అడ్డు తగిలారు. కోపం వచ్చింది. దీనితో బాలయ్య ఆ కార్యకర్త పైన చేయి చేసుకుని మాట్లాడుతూ ఉన్నట్లు మనకు వీడియోలో తెలుస్తుంది . ఇదంతా మనం అక్కడ జరిగిన సన్నివేశాలు చూసింది మాత్రమే . కానీ అక్కడ ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు అన్నది అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది అంటూ బాలయ్యను సపోర్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ వీడియోలో బాలయ్య చేయి చేసుకోవడం తప్పే కానీ అతడు ఏం మాట్లాడితే చేయి చేసుకున్నాడు అన్నది తెలుసుకోవాలి. దొరికిందే ఛాన్స్ కదా అని ట్రోల్ చేయడం న్యాయం కాదు అంటూ బాలయ్యను సపోర్ట్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అనగా ఇలాంటి వీడియో బాలకృష్ణపై వైరల్ అవుతూ ఉండడం ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు..!!