‘ ప్రశాంత్ వర్మ ‘ లో డైరెక్షన్ కాకుండా ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇటీవల హనుమాన్ సినిమాతో సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. మొదట ఆ! సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల సంక్రాంతి బరిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ పేరు రిలీజ్‌కు ముందునుంచే మారుమోగిపోయింది. అంతేకాదు అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తి చూపే స్టేజ్ కి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కు ఉన్న మరో సూపర్ టాలెంట్ బయటపడింది. లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ బ్యాక్ టు ప్రాక్టీస్ అని తన సోషల్ మీడియా నెట్‌లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు.

దీన్నిబట్టి ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టరే కాదు.. క్రికెటర్ కూడా అని అర్థమవుతుంది. స్కూల్ డేస్ నుంచి క్రికెట్ మీద ఇష్టం ఉన్న ప్రశాంత్ వర్మ.. స్కూల్ టోర్నమెంట్‌తో పాటు.. డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఎన్నో మ్యాచ్లను కూడా ఆడాడట. బౌలింగ్, బ్యాటింగ్ లోను తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ప్రశాంత్ వ‌ర్మా గ్రౌండ్లో అందర్నీ మెప్పిస్తాడట. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా అతను ఓ పార్ట్ గా నిలిచాడు. సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడల్లా ప్రశాంత్‌ వర్మ రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ ఉంటాడట. ఇప్పటికీ ఎక్కడ మ్యాచ్ జరిగినా సరే ప్రశాంత్ వర్హ‌ వెళ్లి ఆడతాడని తెలుస్తోంది.

ప్రశాంత్ లో ఈ ప్రొఫెషనల్ క్రికెటర్ యాంగిల్ కూడా ఉందని చాలామందికి తెలియదు. డైరెక్టర్గా యూనిట్ ని లైన్లో పెట్టడం.. సినిమా అవుట్ ఫుట్ లో అద్భుతంగా చూపించడమే కాదు.. ఫీల్డ్ లో సిక్స్ లు కొట్టడం, వికెట్లు తీయడం కూడా ఈ యంగ్‌ డైరెక్టర్‌కు బాగా వ‌చ్చిన తెలుస్తోంది. అలాగే బ్యాడ్మింటన్ లో కూడా ప్రశాంత్ వర్మ కు టచ్ ఉందట. ప్రస్తుతం ప్రశాంత్ వ‌ర్మా లో ఉండే ఈ స్పెషల్ టాలెంట్ చూసిన ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ పై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు ఉన్నాయి.