బాలయ్య 109వ సినిమాలో మెగాస్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మెగాస్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఏ సినిమాలో న‌టించింది అనుకుంటున్నారా.. బాబీ, మెగాస్టార్ కాంబోలో రిలీజైన‌ వాల్తేరు వీరయ్య.. సినిమాల్లో బాస్ సరసన నటించిన ఊర్వశి రౌతెల‌.

ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక తాజాగా బాలయ్య 109వ సినిమాలో కూడా కనిపించనుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అనౌన్స్ చేసింది. ఊర్వశీ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. బాలయ్య 109వ‌ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు.. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు తన రోల్‌ కూడా రివీల్ చేసింది ఊర్వసి.

సో ఈ క్రేజీ ప్రాజెక్టులో ఆమె మంచి పాత్రే అందుకుంది అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవ‌ల వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌తొ దూసుకుపొతున్న బాల‌య్య ఈ సినిమాతో కూడా హిట్ త‌న ఖాతాలో వేసుకుంటాడ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.