డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ అవుతున్న గురు హీరోయిన్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

నటి రితికా సింగ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మాధవన్ హీరోగా నటించిన ఇరుదుసుట్రు మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఇదే సినిమాను తెలుగులో గురూ పేరుతో రీమిక్స్ చేశారు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూక‌ట్టాయి.

నీవెవరో, శివలింగ, ఓమై కడవలె లాంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఇవేమీ ఆమెకు ఊహించని రేంజ్ లో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక తాజాగా రతికా సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ వ‌ళ్ళారి.. డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ కానుంది. మ్రితిక సంతోషిని దర్శకత్వంలో తరికెక్కుతున్న ఈ సినిమాల్లో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు.

హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. దెయ్యం తలకిందులుగా వెళ్లడం, బెడ్ పై మనుషులు గాలిలో తేలడం, మంత్రాలు, క్షుద్ర పూజలు లాంటివి ఏమీ ఉండవని తెలుస్తుంది. ఇక త్వరలో వళ్ళారి ఈటీవీలో స్ట్రీమింగ్ కానుంది. విడుదల డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. కానీ ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనే రిలీజ్ ఉండబోతుందని టాక్.