స్టార్ డైరెక్టర్ కి “ప్యాంట్ తడిచిపోయేలా”..స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్టార్ట్ డైరెక్టర్ కి పరోక్షకంగా ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఐశ్వర్య రాజేష్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుకున్న ఈ బ్యూటీ 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్గా తెలుగులో అడుగు పెట్టింది . తమిళంలో చిన్న చిన్న పాత్రలతో స్టార్ట్ చేసి అక్కడ వరుస అందుకొని .. ఆ క్రేజ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం.

తెలుగులో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ .. నానితో టచ్ జగదీష్ సాయి ధరంతేజ్ తో.. రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది . అయినా సరే ఐశ్వర్య రాజేష్ కి స్టార్ డమ్ దక్కలేదు కానీ ఆమె సినిమాలు బాగుంటాయి అన్న పేరు మాత్రం అభిమానుల్లో దక్కించుకునింది . ఐశ్వర్య రాజేష్ అటువంటి ట్యాగ్ చేయించుకోగలిగింది . బ్యాక్ టు బ్యాక్ తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ పరోక్షకంగా ఒక డైరెక్టర్ పై చేసిన పోస్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఐశ్వర్య రాజేష్ పై దర్శకుడు వీర పాండియన్ చేసిన కామెంట్స్ కి పరోక్షకంగా ఆమె కౌంటర్ వేసింది .

వీర పాండియన్ ఐశ్వర్య రాజేష్ ని పరిచయం చేశాడు. “అయితే ఇప్పుడు ఆమె తనను లెక్కచేయడం లేదు అని.. స్టార్ హీరోయిన్ అయ్యాక ఫోజులు కొడుతుంది అని ఐశ్వర్య రాజేష్ ని పరిచయం చేసింది నేనేనని ..ఆ విషయాన్ని ఆమె ఎక్కడా చెప్పడం లేదు అంటూ మండిపడ్డారు”. ” అంతేకాదు ఒకప్పుడు ఆమె చేతిలో డబ్బులు లేకపోతే ఆటోకు కూడా నేనే డబ్బులు ఇచ్చాను అని ఆమెపై సంచలన కామెంట్స్ చేశారు”.

దీంతో సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య రాజేష్ ఆయన పేరు ఎత్తకుండానే ఘాటుగా ట్విట్ చేసింది . “చాలామంది ఒక వైపే విని మాట్లాడుతూ ఉంటారు .. అసలు విషయం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి జీవితంలోని అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.. ఎవరైనా సరే పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటూ రాసుకొచ్చింది”. ఇది మొత్తం వీరపాండ్యన్ని టార్గెట్ చేసిన ట్వీట్ అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఒకే ఒక్క ట్వీట్ తో ప్యాంటు తడిపేసింది అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు..!!