12 ఏళ్ల కష్టం.. మంచినీళ్లే ఆహారం.. చివరకు రూ.80 కోట్లు మోసపోయాడు.. పూరి జగన్నాథ్ తల్లి..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన భద్ర సినిమాతో దర్శక రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇడియట్ తో బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస‌ సినిమాలను తెర‌కెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా ఎదిగాడుర‌ ప్రస్తుతం ఈయన తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడుర‌ ఇలాంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.

పూరి జగన్నాథ ఏడో తరగతి నుంచి సినిమాలు అంటే ఎంత ఇష్టం పెంచుకున్నాడని.. అనకాపల్లిలో డిగ్రీ చదివిన ఆయన సినీ ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో.. ఇంటి నుంచి కొంత డబ్బు పంపించే వాళ్ళం.. అవి సరిపోక తను కూడా కష్టపడేవాడు అంటూ వివరించింది. ఆఫీసుల చుట్టూ కాలినడకన పూరి తిరిగేవాడని.. ఓసారి నేను వెళ్ళినప్పుడు తన పాదాలు వాచిపోయి.. సాక్సులు వేసుకోవడానికి కూడా కుదరన్నట్లుగా మారాయని.. అవి చూసి నేను ఏడ్చేశా.. ఇంత కష్టం ఎందుకు.. ఊరికి వచ్చేయ్‌.. పొలం పని చేసుకుందామన్న.. కానీ పూరి ఒప్పుకోలేదని.. అలాగే ప్రయత్నించాడని.. 12 సంవత్సరాలు కష్టపడ్డాడు.. అన్నం తినకుండా మంచి నీళ్ళు మాత్రమే తాగిన రోజులు కూడా ఉన్నాయి అంటూ వివరించింది.

నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరికీ రాకూడదు అంటూ చెప్పకొచ్చిన ఆమె.. పూరి దగ్గర పనిచేసే ఓ కుర్రోడు దాదాపు రూ.80 కోట్లు కొట్టేసాడని.. మేమందరం చాలా బాధపడ్డాము.. అదే స‌మ‌యంలో సినిమా తీసి కూడా నష్టపోయాడు.. ఆ అప్పు తీర్చేందుకు మా ప్రాపర్టీస్ కొన్ని అమ్మేశారు.. తనను మోసం చేసిన వాడి కాళ్లు, చేతులు విరిచేద్దామని ఎవరో సలహా ఇస్తే.. పూరి ఒప్పుకోలేదని ఏ జన్మలో అతడికి రుణపడి ఉన్నానో అని వదిలేసాడని.. ఒంట్లో సత్తువ‌ ఉన్నంతవరకు కష్టపడతానని అన్నాడ‌ని వివరించిన ఆమె.. నా కుమారుడు అంత‌టి ద‌య‌మ‌యుడు అంటూ వివ‌రించింది. ఓసారి ఓ వ్యక్తి సాయం కావాలనివస్తే ఇంట్లో ఉన్న నాలుగు లక్షలు ఇచ్చేశాడు. తనకంటూ ఏది ఉంచుకోడు.. ఊరిలో కూడా ఓ గుడి కట్టించాడు అంటూ చెప్పుకొచ్చింది.