కడపలో తలైవర్ రజినీకాంత్.. షూటింగ్ స్పాట్ కు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్..

ఇటీవల ఆంధ్రాలో సందడి చేశాడు తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్. కడప జిల్లాలో ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. రజిని కడపకు వచ్చారు. శ‌ఖ్‌ఖ‌ఢ‌ జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారిలో ర‌జినీ లేటెస్ట్ మూవీ షూటింగ్ స్కేడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ క్వారిలో రూపొందించారు.

దీనికోసం నిన్న కడప చేరుకున్నారు రజినీకాంత్. షూటింగ్ కోసం జమ్మలమడుగు వచ్చిన రజినీకాంత్ కు చూడడానికి భారీ ఎత్తున జనం ఎగబడ్డారు. రజనీకాంత్ వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తెలియడంతో జనం కుప్పలు తెప్పలుగా అక్కడకు చేరుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 170వ‌ సినిమా పొట్టయ‌న్‌ యాక్షన్ సీన్స్ ను ఈ లొకేషన్ లో షూట్ చేస్తున్నారట. జమ్మలమడుగు ప్రాంతం నాపరాయిగ‌నులు ప్రసిద్ధి.

ఇక్కడ ఎర్రగుంటల ప్రాంతంలో నాపరాయి గనిలో ఈ యాక్షన్ సీన్స్ రూపొందిస్తున్నారు. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ డీజే జ్ఞానవెల్ల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ బ్యాన‌ర్‌లో రజనీకాంత్ 170వ‌ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. నడిజీవి ప్రాంతంలోని ఎర్రగుంట్ల పొరపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ షూటింగ్ జరిగింది. మొత్తం రెండు రోజుల షెడ్యూల్లో ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేశారట మేకర్స్.