తరచూ కివి పండ్లను తింటున్నారా.. అయితే ఈ జబ్బు మీ దరిదాపుల్లోకి కూడా రాదు..!

చాలామంది కివి పండ్లను తింటూ ఉంటారు. ఇవి మరి కొందరు మాత్రం అస్సలు ముట్టుకోరు. కానీ వీటిలో ఉండే పోషకాలు గురించి ఇవి నివారించే వ్యాధుల గురించి తెలిస్తే తప్పకుండా తింటారు. కివి పండ్లలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా. కివి పండ్లను తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తిని బలోపితం చేస్తాయి కూడా. అంతేకాకుండా జీర్ణ సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. ఇక మరీ ముఖ్యంగా కివి పండ్లను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు అస్సలు రావు. ఇందులో ఉండే అనేక పోషకాలు కారణంగా గుండె జబ్బులను నివారిస్తాయి. పొటాషియం అధికం

 

ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడానికి సహాయపడతాయి. అలాగే కివిలో ఉండే మెగ్నీషియం నాడి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల ఒత్తిడి సైతం తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కివి పండ్లను తప్పకుండా తినాల్సిందే. ముఖ్యంగా గుండె జబ్బుతో భయపడే వారైతే ఈ పండును తినడం వల్ల గుండెజబ్బు మీ దరిదాపుల్లోకి కూడా రాదు.