సానీయా మీర్జా విడాకుల విషయంలో ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన తండ్రి.. ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించేశాడుగా..!!

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు ఎలా వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే . ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. ఎంతో అన్యోన్యంగా చక్కగా హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ సంసార జీవితంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయి . అప్పటినుంచి వీళ్ళ కాపురానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వీళ్ళ మధ్య అంత సఖ్యతగా లేదు అని .. విడాకులు తీసుకోబోతున్నారు అని .. తెగ ప్రచారం జరిగింది . కానీ విడాకులపై ఇద్దరూ కూడా నోరు విప్పకపోవడంతో ఇదంతా ఫేక్ అనుకున్నారు ఫ్యాన్స్ . అయితే రీసెంట్ గా షోయబ్ మాలిక్ పాక్ నటి సనాజావేద్ ని పెళ్లి చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా సానియామీర్జా అభిమానులు షాక్ అయిపోయారు . అసలు మీరు డివర్సే తీసుకోలేదు కదా .. మరి షోయబ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటూ నిందించడం ..? ప్రశ్నించడం..? మొదలుపెట్టారు .

అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ సానియా మీర్జా తండ్రి సానియా భర్త పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశారు . తన కూతురు సానియా మీర్జా షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు అని బిగ్ బాంబ్ పేల్చారు. షరియా చట్టంలోని కుల పద్ధతిలో సానియానే దివాస్ అడిగింది అని ..ఆమె డివర్స్ ఇచ్చింది అని చెప్పుకు వచ్చారు . షరియా చట్టంలో కుల పద్ధతి ప్రకారం ముస్లిం స్త్రీ తన భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉందని .. ఆ చట్ట ప్రకారమే సానియా అతగాదికి డివర్స్ ఇచ్చింది అని స్పష్టం చేశారు సానియా తండ్రి. దీంతో అభిమానులు షాక్ అయిపోయారు . అంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోవాలసి వచ్చింది అంటూ చర్చిస్తున్నారు . అయితే ఎవరైతే సానియా మీర్జాని ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళకి ఒక్క దెబ్బకి నోరు మూయించే ఆన్సర్ ఇచ్చేశాడు సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!