దంతాలను తెల్లగా, మెరిసేలా మార్చుకోవాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయిపోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరి దంతాలు బలహీనంగా అయిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారం బట్టి తాగే నీరుబట్టి ఈ సమస్య ఏర్పడుతుంది. మన దంతాలని బలంగా మార్చుకుని అలాగే తెల్లగా చేసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మరి అలా బలపరిచే చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా లోని న్యాచురల్ బ్లిచిగ్ గుణాలు దంతాలపై మరకలను తొలగించి దంతాలను బలపరుస్తాయి.

2. పైనాపిల్:
పచ్చి పైనాపిల్ తినడం ద్వారా దంతాలు తెల్లగా మారతాయి. అలాగే బలపడతాయి కూడా.

3. ఉప్పు, పసుపు:
ఉప్పు మరియు పసుపులో ఉండే గుణాలు కారణంగా పంటిపై ఉన్న మరకలు పోయి తెల్లదనం ఏర్పడి దంతాలు బలంగా ఉంటాయి.

4. బొగ్గు:
పూర్వకాలంలో ప్రతి ఒక్కరు బొగ్గుతోనే తమ పళ్ళను శుభ్రం చేసుకునేవారు. ఇందువల్ల బొగ్గులో ఉండే పోషకాలు పంటికి అంది పళ్ళు దృఢంగా తెల్లగా ఉండేవి.

5. స్ట్రాబెర్రీ:
స్ట్రాబెరీ లను తినడం ద్వారా కూడా పళ్ళు తెల్లగా మారి బలహీనంగా మారకుండా ఉంటాయి.

ఈ పైన చెప్పిన ఐదు చిట్కాలను పాటించి మీ పళ్ళను తెల్లగా చేసుకోవడమే కాకుండా దృఢంగా ఉంచుకోండి.