రామ్ చరణ్ నా మాజాకా.. ఫ్యాన్స్ తనను ఫాలో అవుతున్నారు అని తెలిసి ఏం చేశాడో చూడండి(వీడియో)..!!

రామ్ చరణ్ చాలా సరదా సరదాగా ఉంటాడు. అందరితో కలివిడిగా ఉంటారు. చాలా కేర్ఫుల్.. డెడి కేషన్ ఎక్కువ ..చాలా కూల్ పర్సన్ ..అందరికీ ఇంతవరకే తెలుసు. కానీ రామ్ చరణ్లో తెలియని నాటినెస్ కూడా ఉంది . అది రీసెంట్ గానే బయటపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక్క ఫోటో దిగాలని ..ఒక్కసారి అయినా అతనిని డైరెక్టుగా చూడాలి అని ఎంతో మంది మెగా అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు.

అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతుంది అని తెలుసుకున్న అభిమానులు అక్కడికి వెళ్లారు . షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకు అక్కడే వెయిట్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ తన కారులో ఇంటికి బయలుదేరారు.. ఇది కూడా గమనిస్తూ ఆయనను వెంబడించారు ఫాన్స్.. ఇది బాగా గమనించిన రామ్ చరణ్ కారుని స్లో చేయించి మరి అభిమానులకి “చిన్నగా బైక్ డ్రైవ్ చేయమని సలహా ఇచ్చారు”.

“అంతేకాదు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని దయచేసి ఫాలో చేయొద్దు అంటూ సైగ చేశారు” దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ సంస్కారం.. వినయం.. ఫ్యాన్స్ పట్ల అతనికి ఉన్న ప్రేమను మెగా అభిమానులు తెగ పొగిడేస్తూ ఈ వీడియో ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. అదే పరిస్థితుల్లో వేరే హీరో ఉంటే.. ఇలానే ప్యాన్స్ వెంబడిస్తే కార్ ని ఇంకా ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారేమో..లేకపోతే సెక్యూరిటీకి చెప్పి బయపెట్టించి ఉండే వాళ్లు ఏమో.. కానీ ఇతగాడు గ్రేట్ అని ప్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.