నా 13 ఏళ్ళ వ‌య‌స్సులో నా త‌ల్లే నాతో అలాంటి ప‌ని చేపించింది.. స్టార్ బ్యూటీ సంగీతా షాకింగ్ కామెంట్స్‌..?!

సీనియర్ హీరోయిన్ సంగీతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన సంగ‌తి తెలిసిందే. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అందరి మదిని దోచుకుంది. ఈ క్రమంలో తాజాగా సంగీతకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఆమె తన జీవితంలో ఓ పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నానని.. ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ వివరించింది. అంతేకాదు చివరకు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.

Sangeetha accuses mom of exploiting her from age of 13 | Sangeetha accuses mom of exploiting her from age of 13

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగీతా.. తన జీవితంలో జరిగిన వివాదా సంఘటన గురించి షేర్ చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తల్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ తల్లి ఎలా ఉండకూడదు నా తల్లి అలాగే ఉండేది. ఆమెను చూసి ఎలా ఉండకూడదు తెలుసుకోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నన్ను చాలా ఇబ్బందులు పెట్టిందని.. 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తనను డబ్బులు సంపాదించే వస్తువుగా వాడుకుందంటూ వివరించింది.

Celebrity Couple - Actress sangeetha and her husband krish <3 | Facebook

తన అన్నా, తమ్ముడు మత్తుకు బానిసలు అయ్యారని.. వారు ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదంటూ చెప్పింది. కానీ తన తల్లి మాత్రం వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడేదని.. ఎప్పుడు తనని నిందించేదని.. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని.. అంతేకాకుండా నేను నా తల్లి ఉండే ఇంట్లోనే ఉండేదాన్ని.. కొన్ని రోజులు నన్ను ఇల్లు ఖాళీ చేయమంటూ ఆమె ఇబ్బందులు పెట్టిందని.. దీంతో నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాల్సి వచ్చిందంటూ వివరించింది. అంతేకాదు నా భర్తతో నాకు గొడవలు పెట్టాలని ఆవిడ చూసిందని.. నేను సంతోషంగా ఉండడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఇంటర్వ్యూలో సంగీత తన తల్లిపై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారాయి.