పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పవన్ హిట్ మూవీ రీమేక్ తో ఆఖీరా సినీ ఎంట్రీ..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. పవర్ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకున్నారు. ఆయన నటించిన ప్రతి సినిమాతో హిట్ అందుకోవడంతో పవర్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. అయితే రీల్‌ లైఫ్‌లో మంచి నటుడుగా క్రేజ్‌ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రియల్ లైఫ్ లోను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి రియల్ హీరో అయ్యాడు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సక్సెస్ సాధించి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ప‌వ‌ర్ స్టార్‌ మాజీ భార్య రేణు దేశాయ్ కొడుకు ఆకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు.

Only Akira can make her smile | cinejosh.com

తమ అన్న బిడ్డ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వస్తాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆకీర సిని ఎంట్రీ గురించి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. 2000లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెర‌కెక్కి కమర్షియల్ హిట్‌గా మంచి సక్సెస్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమా చాలామంది ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. దీంతో బద్రి సినిమాకు రీమేక్ గా మళ్లీ మరో సినిమా వచ్చినా ఆడియన్స్ చూస్తారని నమ్మకంతో రేణు దేశాయ్ ఆకిరాను బ‌ద్రీ రీమేక్‌తో హీరోగా పరిచయం చేయడానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ట‌. అయితే ఇప్పట్లో ఆఖీరా ఎంట్రీ ఉండదట.. ఇంకా ఆఖీరా చదువు పూర్తి కాలేదు.. తనకి రెండు, మూడేళ్ల సమయం పడుతుంది.

Pawan Kalyan | Badri Movie: Renu Desai recalls 'Chikitha' moment with Pawan Kalyan as Badri completes 21 Years | - Times of India

దీంతో ఆఖీరా హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి మరో మూడేళ్లు పడుతుందంటూ తెలుస్తుంది. గతంలోనూ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఇదే విషయాన్ని వివరించింది. ఆఖీరా ఎంట్రీ గురించి ప్రశ్నించగా ఆకీర చదవ పూర్తి కాలేదని.. చదువు పూర్తి అయిన వెంటనే సినిమా ఎంట్రీ గురించి ఆలోచిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం అందుతున్న‌ సమాచారం ప్రకారం ఆఖీరా హీరోగా ఇంట్రీ ఇవ్వాలంటే మాత్రం బద్రి రీమేక్ తో తన మొదటి సినిమా హీరోగా ఆఖీరానందన్ పరిచయం అవుతాడంటూ సమాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో తమ అన్న కొడుకు ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.