ఆ విలేజ్ లో ఇంటికి ఒక విమానం.. బైక్ లా ఇంటి ముందే పార్కింగ్..

ప్రస్తుత కాలంలో ఇంటికో బైక్ ఉండడం సాధారణంగా మారిపోయింది. దీంతో బైక్ లేని గ్రామాలు అనేవి కనిపించడం లేదు ఇక అవసరాన్ని బట్టి కార్లు కూడా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇంటింటికి ఓ విమానం ఉంటుంది. ఏంటి ఇంటింటికి ఓ విమానమా.. అలాంటి ప్లేస్ కూడా ఉందా అనుకుంటున్నారా.. ఇది నిజంగానే నిజం. అయితే ఇప్పటికే చాలామంది ప్రజలకు ఎప్పటికైనా విమానం ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు విమానం ఎక్కాలంటే ఖర్చుతో కూడిన పని కనుక అది ఎంతమంది విషయంలో నెరవేరుతుందో చెప్పలేం. అలాంటిది ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఇంటికి సొంత విమానం ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

అది ఎక్కడ కాదు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కెమెరాన్ ఏయిర్ పార్క్ అనే గ్రామంలో. అక్క‌డ‌ వరుసగా ఇంటి ముందు బైక్లు మాదిరిగా విమానాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి వారంతా తమ సాధారణ ప్రయాణాలకు విమానాలనే ఉపయోగించడంతో ఈ ప్రాంతం ఎప్పుడు వార్తల్లో వైరల్ గానే ఉంటుంది. స్పెషల్ జెట్ అంటే పెద్ద పెద్ద వీఐపీలు, శ్రీమంతులకే సాధ్యమవుతుంది. కానీ కెమెరాన్ ఏయిర్ పార్క్‌ గ్రామస్తులు మాత్రం తమ ట్రావెలింగ్ కోసం సొంత విమానాలను ఉపయోగిస్తూ ఉంటారు. వీరి విమానాలు వారే స్వయంగా నడుపుతుండగా గ్రామంలోకి రాకపోకలు సాగించేలా రన్వే తో పాటు ఇళ్ళ‌ముందు పెద్ద పెద్ద పార్కింగ్ స్థలాలు కూడా ఉంటాయి.

ప్రతి ఇంటికి సొంత విమానాలు ఉన్న లైసెన్స్ లేకుండా ఆ విమానం నడపడం నిషిద్ధం. అందుకే గ్రామంలో ఉన్న అందరికీ విమానం నడిపేందుకు లైసెన్స్ కూడా ఉంటుంది. అలాగే ఈ గ్రామంలో చాలా మంది రిటైర్డ్ మిలటరీ పైలెట్లు కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. విమానాలను బైక్ కంటే ఈజీగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో వేరే వాళ్ళు ప్రయాణించాలంటే మాత్రం అక్కడ స్థానికుల పర్మిషన్ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జనం తమ‌ వ్యక్తిగత, వృత్తి, వ్యాపార అవసరాలకు లగ్జరీ విమానాలను అవలీలగా నడిపిస్తూ ఉంటారు.

అందుకే ఈ గ్రామానికి ప్లైన్ కమ్యూనిటీ అనే పేరు కూడా ఉంది. అయితే ఇంటింటికి ఫ్లైట్ ఉండడం వెనుక ఒక కథ కూడా ఉందట. రెండో ప్రపంచ యుద్ధం టైం లో విమానాల వాడకం భారీగా పెరిగటంతో.. ఆ విమానాలను భద్రపరచడానికి కొంత స్థలాన్ని తీసుకున్నార‌ట‌. సమయం గడిచే కొద్ది ఈ ప్రాంతం ఏయిర్ పార్క్‌గా, ఫ్లయింగ్ కమ్యూనిటీలు గా మారాయి. అయితే కెమెరాన్ ఏయిర్ పార్క్‌ 1946లో మొదటి స్థాపించగా ఆ గ్రామం మొత్తం 124 ఇల్లు మాత్రమే ఉంటాయి.