కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో అవసరం లేదు డ్యూడ్.. మహేష్ ని భారీ దెబ్బ కొట్టిన తేజ..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ ఏ విషయం అయినా సరే ఓపెన్ గా చెప్పడం నేర్చుకున్నారు . మరీ ముఖ్యంగా అవతల ఉన్నది స్టార్ సెలబ్రెటీ .. నార్మల్ పీపుల్ నా .. అనేది ఆలోచించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేస్తున్నారు. రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయిన గుంటూరు కారం హనుమన్ సినిమాలకు సంబంధించి రివ్యూలు కూడా అలానే ఇస్తున్నారు . పలుచోట్ల గుంటూరు కారం సినిమాకు 2.5 రేటింగ్స్ ఇస్తూ ఉండడం గమనార్హం .

భారీ సపోర్ట్ తో.. భారీ బడ్జెట్ తో ..భారీ తారగానంతో తెరకెక్కిన గుంటూరు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనే టాక్ దక్కించుకుంది. కుర్చీ మడత పెట్టి సాంగ్, శ్రీలీల డాన్స్ , మహేష్ బాబు నటన ఈ మూడు తప్పిస్తే సినిమాలో పెద్దగా ఏమీ లేదని ఓపెన్ గా చెప్పేస్తున్నారు . అదే హనుమాన్ విషయానికి వస్తే తేజ ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న యంగ్ హీరో . సపోర్ట్ కూడా పెద్దగా లేదు . అంతేకాదు హనుమాన్ సినిమాను చాలామంది తొక్కేయాలని కూడా చూశారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి .

ఇంత స్ట్రెస్ లోను ఇంత చీటింగ్ చేసిన ఇండస్ట్రీలోనూ ఆయన నిలదొక్కుకొని తన సినిమాని రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు . దీంతో సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాపై నెగటివ్ కామెంత్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదు డ్యూడ్ అంటూ హనుమాన్ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . దీంతో మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత భారీ సపోర్ట్ ఉన్న ట్రోలింగ్ కి గురవ్వక తప్పడం లేదు..!!