‘ గుంటూరు కారం ‘ ఎఫెక్ట్‌.. ఇండస్ట్రీకి ద‌రిద్రం అంటూ.. శ్రీ‌లీల‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజ‌న్స్‌..

టాలీవుడ్ యాంగ్ బ్యూటీ శ్రీ లీల పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన‌ ఈ ముద్దుగుమ్మ ఈ మూవీలో తన నట‌న‌కు మంచి మార్కులు సంపాదించింది. తర్వాత రవితేజ ధమాకా తో బ్లాక్ బస్టర్ ఆఫర్లను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలో సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. కాగ‌ ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్స్ అయ్యాయి.

రామ్ పోతినేని.. స్కంద, వైష్ణవ్ తేజ్.. ఆది కేశవా, నితిన్.. ఎక్స్ట్రార్డినరీ మ్యాన్‌ మూడు సినిమాలు ధియేటర్స్ లో రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. వీటిలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. ఇక ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీ లీలనే మెయిన్ హీరోయిన్ గా న‌టించింది. ఈ మూవీ ఈ రోజు రిలీజ్ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ శ్రీలీలపై ఫైర్ అవుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీకి శ్రీలీల‌ దరిద్రమని.. గుంటూరు కారం సినిమా ప్లాఫ్‌కు కూడా ఆమె కారణమంటూ ఆమెను ఫైర్ అవుతున్నారు. వేరే హీరోయిన్‌ను తీసుకుని ఉంటే గుంటూరు కారం పై మరింత హైప్‌ వచ్చేదని.. శ్రీ లీలపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె నటించిన అన్ని సినిమాలు వరుసగా ప్లాఫ్‌ కావడంతో శ్రీ లీలకు సినిమా అవకాశాలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.