సీనియారిటీ VS టాలెంట్: ఫైనల్లీ ఏది గెలిచిందంటే..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో గుంటూరు కారం VS హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫైట్ ఎలా నెలకొనిందో మనం చూస్తున్నాం . మొదటి నుంచి కూడా ఈ రెండు సినిమాలకు సరి సమానంగానే టాక్ వస్తూ వచ్చింది . కాగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి . కానీ గుంటూరు కారం తో కంపేర్ చేస్తే హనుమాన్ సినిమా రెండు మెట్లు పైకి ఎక్కిందని చెప్పాలి .

గుంటూరు కారం లో అదే యాక్షన్ ..అదే రొమాన్స్.. అదే డాన్స్ అంటూ జనాలు పాత చింతకాయ పచ్చడి తో పోలుస్తున్నారు. హనుమాన్ సినిమా చాలా డిఫరెంట్ గా ఉందని.. సరికొత్త కాన్సెప్ట్ తో సరికొత్త కథతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానం చాలా చాలా బాగుంది అని ఆయన పొగిడేస్తున్నారు . మరీ ముఖ్యంగా సింపుల్ బడ్జెట్లో ఇంత భారీ వి ఎఫ్ ఎక్స్ చూపించడం ప్రశాంత్ వర్మకే చెల్లింది అని.. అన్నిచోట్ల సీనియారిటీ సపోర్ట్ పనిచేయవు అని..

కొన్నిసార్లు టాలెంట్ బాగా వర్క్ అవుట్ అవుతుందని. ఈసారి మాత్రం సంక్రాంతి విన్నర్ ప్రశాంత్ వర్మ అని అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో సీనియారిటీ సపోర్ట్ దొరికిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గుంటూరు కారం సినిమా రెండో స్థానంలో నిలిచింది. టాలెంట్ నమ్ముకున్న హనుమాన్ సినిమా మొదటి స్ధానం లో నిలిచి సంచలన విజయాని అందుకుంది..!!