ముచ్చటగా మూడోసారి.. ఆ హీరోయిన్ తో నటించబోతున్న మహేశ్ బాబు.. ఇక కుమ్మి పడేయాల్సిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ముచ్చటగా మూడోసారి ఆ హీరోయిన్ తో నటించబోతున్నాడు అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకంటూ స్పెషల్ స్టేటస్ కూడా ఉంది. మహేష్ బాబు ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటారు .

కానీ మహేష్ బాబు కొంతమందితో మాత్రమే చనువుగా మూవ్ అవుతూ ఉంటారు . రీసెంట్గా ఆ లిస్టులో తమన్నా కూడా ఉన్నట్లు తెలిసిపోతుంది. వీళ్ళు కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ఇంత చనువుగా తమన్న – మహేష్ బాబు మాట్లాడుతుండడం చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు . మహేష్ బాబు తమన్నా ఆగడు సినిమాలో నటించారు . ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరులో ఐటమ్ సాంగ్ లో కనిపించారు.

ఇప్పుడు ఒక యాడ్ షూట్ కోసం వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో ముచ్చటగా మూడోసారి ఈ జంటను చూడబోతున్నారు మహేష్ బాబు అభిమానులు . ప్రజెంట్ వీళ్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా సంక్రాంతి కానుకగా మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు కుర్చి మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్ లో ఊపేస్తుంది..!!