డబ్బు కోసమే మా అమ్మని చంపేశారు.. యాక్టర్ లత శ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ లో పలు సినిమాలో నటించి మెప్పించిన సీనియర్ యాక్టర్ లత శ్రీ. 1990లో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించింది. ముద్దుల మేనల్లుడు, అబ్బాయిగారు, అల్లరోడు, ఆ ఒకటి అడక్కు, యమలీల లాంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ రోల్ లో మెప్పించి తన గ్లామర్ తో నట‌న‌తో ఆకట్టుకుంది. ఇక మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె కుటుంబానికి పరిమితం అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్న నాగశౌర్య మేనత్త ఈ ల‌త శ్రీ. అన్న కొడుకు నాగశౌర్య ఇండస్ట్రీకి పరిచయం కావడానికి కారణం కూడా ఆమె. ప్రస్తుతం తన అన్నకు దూరంగా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లత శ్రీ.. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వివరించింది.

తనకు ఎక్కువగా కన్నడ అవకాశాలు వచ్చాయని.. తల్లి తెలుగులోనే సినిమాలు చేయమని చెప్పడంతో ఇక్కడే చేస్తూ వచ్చానని వివరించింది. మలయాళం లో అవకాశాలు వచ్చిన అక్కడ ఓ డైరెక్టర్ అందరి ముందు నాకు నటన రాలేదని ఎగతాళి చేశాడ‌ని అప్పటి నుంచి మలయాళ సినిమాలు చేయ‌లేద‌ని వివరించింది. ఇక తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఆమెకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్చమని.. బాగానే ఉంది, మాట్లాడుతుంది, డిశ్చార్జ్ చేస్తారు అనుకుంటే అదే వంక.. ఇదే వంక అని 18 రోజులు ఐసీయూలో పెట్టారు. డబ్బు కోసం చేస్తున్నారని మాకు తెలియడంతో తీసుకువెళ్లిపోవాలనుకున్నాం. ఆ విష‌యం హాస్పిటల్ సిబ్బందికి తెలిసిపోయింది. కాగా మరుసటిరోజే అమ్మ చనిపోయింది అంటూ లత శ్రీ ఎమోషనల్ అయింది.

ఇక తెలుగు దర్శకులు ఆమెను ఎంతగానో ప్రోత్సహించార‌ని ఇవివి, ఎస్వి కృష్ణారెడ్డి మంచి పాత్రలు ఇచ్చారని.. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాల్లోనే నేను ఎక్కువగా నటించానని అది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ వివరించింది. అయితే ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని.. కొన్ని నేనే వదులుకున్నాను అంటూ చెప్పిన లత శ్రీ.. తన లవ్ స్టోరీ గురించి కూడా వివరించింది. మొదటి నుంచి నాకు జిమ్ చేయడం అలవాటని.. అలా జిమ్‌కి వెళ్లిన టైం లోనే జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డాను అని.. అతని తండ్రి డిప్యూటీ కలెక్టర్ కావడంతో.. ఆయనతోపాటు తన తల్లి కూడా పెళ్లికి ఒప్పుకోలేదని.. అయినా సరే అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని వివరించిన ల‌త‌ ప్రస్తుతం కుటుంబంతో కలిసి హ్యాపీ లైఫ్ గడుపుతుంది.