గుంటూరు కారం VS హనుమాన్: ఏ సినిమా హిట్..ఏ సినిమా ఫట్..?

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టఫ్ ఫైట్ నెలకొందో మనకు తెలిసిందే . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అలాగే తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ భారీ కాంపిటీషన్ ఇచ్చుకున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ దక్కించుకోవడం మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రెండు సినిమాలకు సంబంధించి పాజిటివ్ రివ్యూ లు వింటున్నాం .

అయితే బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా హిట్ ఏ సినిమా ఫ్లాప్ అన్న క్వశ్చన్స్..కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . చాలామంది జనాలు హనుమాన్ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా ఓకే మహేష్ బాబు నటన బాగుంది ..శ్రీలీల డాన్స్ బాగుంది .. త్రివిక్రమ్ అదే పాత చింతకాయ పచ్చడి లాగా సినిమాను తెరకెక్కించాడు అని .. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం తన టాలెంట్ తో హనుమాన్ – శ్రీరాముడు మధ్య ఉన్న బంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు అని..

మాస్ మసాలా రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎవరైనా తెరకెక్కిస్తారని .. కానీ ఇలాంటి భక్తి భావంతో నిండిన సినిమా తెరకెక్కించడం ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కి సాధ్యమంటూ గుంటూరు కారంని కొంచెం తక్కువ చేస్తూ హనుమాన్ సినిమాను ఓ రేంజ్ లో పొగిడెస్తున్నారు . అంతేకాదు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా హనుమాన్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు..!!