అర్ధరాత్రి అమ్మాయిలకు వీడియో కాల్స్‌ చేసి చిత్రహింసలు పెడుతున్న సుడిగాలి సుధీర్.. బయటపడ్డ అసలు నిజాలు (వీడియో)..!

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు సుదీర్. ఇక ముఖ్యంగా సుదీర్, రష్మితో కొన్ని షోస్ లో జంటగా చేసి ప్రత్యేకమైన ఓ ఫ్యాన్ బేస్ ను కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు కొన్నిటిలో ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఇక వీటిపై వీరిద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ వార్తను మాత్రం ఆగలేదు.

ఇక ప్రస్తుతం సుధీర్ పలు సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సుధీర్ అమ్మాయిలకి ఫోన్ చేసి వేధిస్తున్నట్లు ఓ షోలో భాగంగా ఓ అమ్మాయి చెప్పడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఛానల్లో ” అల్లుడా మజాకా ” అనే స్పెషల్ షో రానుంది. ఈ షోకు వెంకటేష్, మీనా, కుష్బూ గెస్ట్లుగా హాజరయ్యారు. అలాగే హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, నాగినీడు, రాంప్రసాద్ తో పాటు బుల్లితెర నటీనటులు ఈ షోలో హాజరయ్యారు.

ఇందులో భాగంగానే కొందరు అమ్మాయిలను పిలిచి సుడిగాలి సుదీర్ ఎలాంటి వాడని ఆది అడుగుతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి నా పతి అంటుంది. అలాగే మరొక అమ్మాయి.. రాత్రిపూట సుధీర్ వీడియో కాల్ చేశాడు. అమ్మ వస్తుంది ఫోన్ పెట్టేయ్ అంటే అమ్మని కూడా చూపించి చూస్తాను అని వేధిస్తున్నాడు అంటూ చెప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అదంతా స్క్రిప్ట్ కోసమే చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.