యూఎస్ లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ” హనుమాన్ “..!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమాల నుంచి సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో ” హనుమాన్ ” మూవీ ఒకటి. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి రానే వచ్చింది.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ రిలీజ్ అండ్ ప్రీమియర్స్ కి రెస్పాన్స్ అందుకోగా యూఎస్ మార్కెట్ లో కూడా హనుమాన్కి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

మరి ఈ సినిమాని యుఎస్ మార్కెట్లో నిర్మాణ మూవీస్ వారు రిలీజ్ చేయగా ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 3 లక్షల డాలర్ల మార్క్ ని క్రాస్ చేసి సూపర్ స్ట్రాంగా దూసుకుపోతుంది. మొత్తానికి అయితే హనుమాన్ కి ఒక గట్టి స్టార్ట్ అయితే దక్కిందని చెప్పొచ్చు. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.