ఆ విషయంలో ప్రశాంత్ వర్మ కాళ్లకి దండం పెట్టాల్సిందే.. ఏం క్రియేటివిటీ రా సామీ ఇది..!!

ప్రశాంత్ వర్మ .. ఈ పేరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా ప్రశాంత్ వర్మ ఇన్నాళ్లు తెరకెక్కించిన సినిమాలు ఒక లెక్క రీసెంట్గా తెరకెక్కించిన హనుమాన్ మరొక లెక్క అన్న రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటించిన సినిమా హనుమాన్ . ఫుల్ టు ఫుల్ హనుమాన్ – శ్రీరామ్ బ్యాక్ గ్రౌండ్లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ట్రీట్ అభిమానులను కట్టిపడేసింది. అంతేకాదు గతంలో రాముడు ఆంజనేయ స్వామి పై ఎన్నో సినిమాలు వచ్చాయి . భారీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలో కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆది పురుష్ కోసం ఓంరావత్ ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమాను తెరకెక్కించారో మనకు తెలిసిందే . కానీ ప్రశాంత్ వర్మ మాత్రం చాలా సింపుల్ బడ్జెట్ తో భారీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ తో అది కూడా చిన్నపిల్లలకి జనాలకి అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హైలెట్గా మారింది.

అంతేకాదు ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ అభిమానులు . అంతేకాకుండా ప్రశాంత్ వర్మ కాళ్ళకి దండం పెట్టాలి అని విజువల్ ఎఫెక్ట్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటూ పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా అభిమానులకి బాగా నచ్చేసింది. ఇది ఓ వండర్ ఫుల్ మూవీ అనే చెప్పాలి..!!