స్టార్ తో నేను సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. రాజమౌళి పై కోపం వచ్చింది.. ప్రశాంత్ వర్మ

ఎప్పుడో కానీ హనుమాన్ లాంటి సినిమాలు రిలీజ్ అవ్వవు. చిన్న సినిమాగా రిలీజై భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది సాధారణ విషయం కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా హనుమాన్ ప్రేక్షకులు ముందుకు వ‌చ్చి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ.. తేజ సజ్జ‌ సక్సెస్ సాధించాడు. హనుమాన్ మూవీ సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి క్రెడిట్ దక్కింది. రూ.50 కోట్ల బడ్జెట్లో రూ.500 కోట్లకు మించిన విజువల్స్ సినిమాలో చూపించాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ బడా సినిమాల దర్శకులకు ఒక రిఫరెన్స్ అంటూ బాలీవుడ్ ప్రముఖులు కూడా చెప్పుకొచ్చారు. హనుమాన్ వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లు కొల్లగొట్టింది.

కేవలం రూ.22 కోట్ల బిజినెస్ చేసిన హనుమాన్ డిస్ట్రిబ్యూటర్లకు ఏ రేంజ్ లో లాభాలను తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. యుఎస్ లో హనుమాన్ ఐదు మిలియన్ వశులు దాటేసింది. టాప్ స్టార్స్ కూడా అందుకోలేని ఫీట్లు హనుమాన్ సొంతం చేసుకుంది. కాగా ప్రశాంత్ వ‌ర్మా టాలెంట్ ని పరిశ్రమ ఇప్పుడిప్పుడే గుర్తిస్తుంది. గతంలో రాజమౌళి అసిస్టెంట్‌గా.. ప్రశాంత్ వర్మ రిజెక్ట్ చేశాడట. ఆ విషయంలో నాకు చాలా కోపం వచ్చిందని ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజమౌళి మేకింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమని.. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే ఆయనకు ఎన్నోసార్లు అసిస్టెంట్ గా అవకాశం ఇవ్వమని మెయిల్ పెట్టానని.. తన టీమ్ లో కాళీ లేదు అంటూ రాజమౌళి స్మూత్ గా రిజెక్ట్ చేశాడని వివ‌రించాడు.

నేను అంత హార్డ్ వర్క్ చేశాను.. అయినా రాజమౌళి అవకాశం ఇవ్వడం లేదు ఏంటని.. నాకు కోపం వచ్చింది అంటూ వివరించాడు. ఇక నేను స్టార్ సెలబ్రిటీలతో సినిమాలు చేయడానికి వ్యతిరేకిని కాదు. కాకపోతే స్టార్స్ తో సినిమా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా ఎదురు చూసి టైం వేస్ట్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉన్న సెలబ్రిటీలతోనే సినిమాలు చేస్తా.. డెడ్ లైన్ పెట్టుకుని సినిమాలను కంప్లీట్ చేస్తా. టామ్ క్రూజ్ వచ్చిన నాకు అందుబాటులో ఉన్న హీరోతోనే నేను సినిమా తెరకెక్కిస్తా అంటూ వివరించాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.