ఇండియన్ మూవీ లో నటించిన తొలి మహిళా నటి ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ఇండియన్ మూవీ మొదటి దశలో చాలా వింత పరిస్థితులు ఉండేవి. నాటి సాంఘిక ఆచారాల ప్రకారం మహిళల విషయంలో ఎంతో కఠినంగా ఉండేవారు. కాలక్ర‌మేణా మార్పులు వచ్చాయి కానీ.. అప్పట్లో మహిళలు సినిమాల్లో నటించడం అనేది నిషేధం. అందుకే సినిమాల్లో మహిళల పాత్రలను కూడా మగవాళ్లే పోషించేవారు. కానీ ఆ ధోరణికి బస్మాసుర మోహిని సినిమాతో చెక్ పెట్టారు. దాదాసాహెబ్ ఫాల్ల్కే మొదటిసారి ఈ సినిమాతో ఇండియన్ మూవీలో మహిళలు ప్రవేశపెట్టారు. ఈ సినిమాలో పార్వతి దేవి పాత్రలో దుర్గాబాయి, మోహిని పాత్రలో ఆమె కుమార్తె కమలాబాయి గోకులే నటించి ఆకట్టుకున్నారు.

దీంతో తొలి నటిగా దుర్గాబాయి, తొలి బాలనాటిగా కమలాబాయి చరిత్రలో స్థానాన్ని సాధించారు. 1912 – 1913 సమయంలో ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం మేకర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే తన సినిమాలో మోహిని భస్మాసురా కోసం క్యాస్టింగ్ ఎంపికలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే దాదాసాహెబ్ తన మునుపటి సినిమా రాజహరిశ్చంద్ర మహిళా ప్రధాన పాత్రలో నటి లేకపోవడంతో ఒక యువ వంట మనిషి అన్న సాలుంకే అనే ఓ వ్యక్తిని ఉపయోగించాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే మొదటి తొలి మహిళగా ప్రధాన పాత్ర పోషించిన కమలాబాయి.. jj స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో హిస్టరీ ప్రొఫెసర్ అయిన ఆనంద్ కామత్, దుర్గాబాయి కామత్ కుమార్తె.

ఆమె రఘునాధ రావు గోకులను వివాహం చేసుకుంది. ఇక వీరికి ముగ్గురు సంతానం. చంద్రకాంత్ గోకులే, లాల్జీ గోకులే, సూర్యకాంత్ గోకులే. వీరు ముగ్గురు పిల్లలు ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ప్రముఖ నటి దుర్గాబాయి కామత్‌ కుమార్తె కమలాబాయి.. 1900 లో జన్మించింది. ఈమెకు 1912-13 సమయంలో భారతదేశపు స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ దాదా సాహెబ్ ఫాల్కే తన సినిమాలో మోహిని భస్మాసుర పాత్రకు నటిగా ఎంచుకున్నాడు. అందులో కమలాబాయి ప్రధాన పాత్రలో.. కమలా బాయి తల్లి దుర్గ బాయి పార్వతి పాత్రలో నటించింది.

ఆ తరువాత ఆమెకు15 ఏళ్లు వచ్చేసరికి కమలాభాయి స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. మరుసటి సంవత్సరం ఆమె రఘునాధ రావు గోకులేను వివాహం చేసుకుంది. అతడు సాధారణంగా స్త్రీ పాత్రలను పోషించే కిర్క్కోసారి నాటక కంపెనీలో ఉండేవాడు. ఇక అతని గాత్రంతో పాపులర్ అయిన రఘునాధరావు.. తన సోదరుడి కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. అదే కమల బాయి, ఆమె తల్లి ఉద్యోగం చేసే కంపెనీ. 1930 లలో కమలాబాయి హరిజనుల దుస్థితి పై దృష్టి సారించి.. ఉషప్‌ నాటకం వీరసావర్కర్ ఆధ్వర్యంలో పనిచేసింది. ఇక దాదాపు 35 సినిమాల్లో నటించింది కమలాబాయి. ఆమె చివరిగా గహ్రాయి సినిమాలో మెప్పించింది.