హీరోయిన్ కాజల్ ఫిట్నెస్ కి కారణం ఇదే.. బయటపడ్డ సీక్రెట్..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. 38 ఏళ్ల వయసులోనూ స్లిమ్ గా చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

ఈమె ఫిట్నెస్ ని చూసి కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడతారు. ఇక ఈమె ఫిట్నెస్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కాజల్ తమ అభిమానులతో పంచుకుంది. ఆమె ప్రతిరోజు యోగా చేస్తానని చెప్పింది. అలానే రోజులో కనీసం అరగంట వ్యాయామం చేయాలని సూచించింది. అయితే ప్రతి రోజు ఒకే రకమైన వ్యాయామం కాకుండా రకరకాల వ్యాయమాలు చేయాలని చెప్పింది.

అలానే డైట్ విషయంలో కూడా చాలా స్ట్రిట్ గా ఉండాలని తెలిపింది. పోషకమైన ఆహారాలను తినాలని.. నాన్ వెజ్ కన్నా వెజిటబుల్స్ ని ఎక్కువగా తినాలని సూచించింది కాజల్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె చెప్పిన ఫిట్నెస్ సీక్రెట్స్ పలువురు ఫాలో అవుతున్నారు కూడా.