మహేష్ ” గుంటూరు కారం ” 15 డేస్ కలెక్షన్స్ ఇవే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది.

ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓ రేంజ్ కలెక్షన్స్ రాబడతాయి. అలానే ఈ సినిమా కూడా మహేష్ పై ఉన్న అభిమానంతో బానే వసూళ్లు వచ్చాయి.

ఇక ఈ సినిమా 15 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఈ మూవీకి రూ.130.4 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. అలానే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి రూ.109.3 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.21.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇక ఈ సినిమాని చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేలా కనిపించడం లేదు.