సన్నీలియోన్ చేతులతో చేసిన వంటలను తినాలనుకుంటున్నారా?.. ఇక్కడికి వెళ్తే మీ కల నెరవేరినట్లే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒకపక్క సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా మరోపక్క అనేక బిజినెస్ లలో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది.

ఇక తాజాగా ఓ హోటల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె రెస్టారెంట్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ అనేక రకాల వంటకాలు కూడా లభిస్తాయి. ఇక ఈమె రెస్టారెంట్ కి ” చకలోకా నోయిడా ” అని పేరు పెట్టింది. ఇక ఈ హోటల్ కి సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది సన్నీ లియోన్.

ఇక రెస్టారెంట్ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసింది. ఇక ఈమె చేతి వంట తినాలనుకునేవారు ఈ రెస్టారెంట్ కి వెళితే వారి కోరిక తీరుతుంది. ఇక ప్రస్తుతం ఈమె రెస్టారెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయినప్పటికీ ఈ రెస్టారెంట్ భారీ గా లాగుతుందట.