రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న శివాజీ.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోగా ఉండేవాడా..?!

టాలీవుడ్ యాక్టర్ శివాజీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ గా కెరీర్‌ స్టార్ట్ చేసి.. హీరోగా మారిన శివాజీ.. ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. కెరీర్‌లో 90 కి పైగా సినిమాల్లో నటించిన శివాజీ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటిస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాడు. తన ఆట‌తీరుతో.. బిగ్ బాస్ చాణుక్యుడిగా బిరుదును సొంతం చేసుకున్న శివాజీ కొంచంలో టైటిల్ మిస్ చేసుకున్నాడు.

Sivaji Wiki, Biography, Age, Family, Height, Movies, Wife, Bigg Boss 7  Telugu, And More - StudyBizz Bigg Boss

ఇక బిగ్‌బాస్‌లో పాల్గొనక ముందే పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన శివాజీ.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు. గతంలో తాను ఎంతోమంది ఆర్టిస్టులకు, హీరోలకు డబ్బింగ్ చెప్పాన‌ని.. ఆ సినిమాలన్నీ దాదాపు సక్సెస్ సాధించాయి అంటూ వివరించాడు. నేను హీరోగా మాత్రం మరో స్థాయికి వెళ్ళలేకపోయాను అంటూ చెప్పిన శివాజీ.. మిస్సమ్మ సూపర్ హిట్ కావడంతో నా ఆటోగ్రాఫ్ మూవీ లో నటించే ఛాన్స్ వచ్చిందని.. నా దురదృష్టం కొద్దీ ఆ మూవీ రవితేజ చేతులకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు.

Naa Autograph Sweet Memories (2004) - IMDb

అయితే అప్పట్లో నా పాపులారిటీకి తగ్గట్లుగా సినిమా నాకు సెట్ అయ్యేదని.. రవితేజకు నా ఆటోగ్రాఫ్ అంతగా సూట్ కాలేదని అప్పటికే ఆయన మాస్ మహారాజ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడని వివరించాడు. అయితే ఇప్పటికీ ఆ సినిమా చేజారినందుకు ఎంతగానో బాధపడుతున్న అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. ఇక జెనీలియా, రాజా కలిసిన నటించిన మిస్టర్ మేధావి సినిమా నేను చేసి ఉండాల్సిందని.. ఆ సినిమాని నేను చేసి ఉంటే కచ్చితంగా స్టార్ హీరో అయ్యుండేవాడిని అంటూ శివాజీ వివరించాడు.

Mr. Medhavi (2008) - IMDb

అయితే రాజాను హీరోగా ఓకే చేసిన తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయని.. అందుకే ఆ సినిమా సక్సెస్ సాధించలేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ర‌వితేజా ఫ్యాన్స్ మాస్ హీరో అయినా సరే నా ఆటోగ్రాఫ్ సినిమాలో ర‌వితేజా ఒదిగిపోయి నటించాడు.. ఆయన యాక్టింగ్‌కు మూవీలో అసలు తిరుగులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.