మొద‌టిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో న‌టించ‌బోతున్న‌ పూజ హెగ్డే.. డైరెక్టర్ ఎవరంటే..?

సౌత్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకటి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకున్న బుట్ట బొమ్మ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక గత కొంతకాలంగా ఆమెకు టాలీవుడ్ అవకాశాలు రావడం లేదు.

11 striking outfits that highlight Pooja Hegde's wedding guest style |  Vogue India

చివరిగా మహేష్ గుంటూరు కారం సినిమా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్‌లోనూ ఆమెకు సక్సెస్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో కోలీవుడ్ నుంచి ఆమెకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన‌ ఏవీఎం బ్యాన‌ర్‌లో తీయబోతున్న ఓ సినిమాకు పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోందట.

Only Money Matters For Pooja Hegde? | cinejosh.com

ప్రముఖ ఓటిటి సంస్థ కోసం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ లేడి ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తుంది. పూజా హెగ్డే తన కెరీర్‌లో మొదటిసారి లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతుంది. ఈ మూవీకి డీమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్ సినిమాల డైరెక్టర్ అజయ్ జ్ఞానముతూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక‌ ఇప్పటివరకు హీరోల పక్కన గ్లామరస్ బ్యూటీగా కనిపించిన ముద్దుగుమ్మ.. ఒకేసారి ఉమెన్స్ సెంట్రిక్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.