అందరి ముందే శేఖర్ మాస్టర్ ని అలాంటి ప్రశ్న అడిగిన యాంకర్ శివ.. ఇంత పరసనల్ మ్యాటర్ అడగడానికి సిగ్గుందా..?

ఈ మధ్యకాలంలో పలు షో స్ టిఆర్పి రేట్స్ ను పెంచుకోవడానికి ఎలాంటి వింత వింత స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా జబర్దస్త్ – శ్రీదేవి డ్రామా కంపెనీ -ఢీ షో లలో వచ్చే కొన్ని వల్గర్ డైలాగ్స్ అభిమానులను హర్ట్ చేస్తున్నాయి . కాగా మరికొందరు పబ్లిసిటీ స్టంట్ అంటూ తమ పర్సనల్ మ్యాటర్స్ సైతం బయటపడుతున్నారు . రీసెంట్ గా ఢీ సీజన్ 17 షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

అయితే ఈసారి ఢీ 17 షోను నందు హోస్ట్ చేయబోతున్నాడు . కాగా షోలో కొత్త కొత్త ముఖాలు కనిపించడం గమనార్హం. ఇలాంటి క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన కాంట్రవర్షియల్ యాంకర్ శివ రావడం రావడమే శేఖర్ మాస్టర్ ని గెలికాడు . మైక్ తీసుకున్న యాంకర్ శివ..” మాస్టర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి.. మీకు ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోయిన్ కి ఎఫైర్ ఉందంటగా ..?అంటూ ప్రశ్నిస్తాడు”.

శేఖర్ మాస్టర్ కి వెంటనే కోపం వచ్చేస్తుంది. ” ఏంటి..? అంటుకోప్పడిపోతారు “. అంతేకాదు “నిన్ను ఎవరు లోపలికి రానిచ్చాడు ..? నువ్వు వెళ్ళిపోతావా ..? నన్ను వెళ్ళిపోమంటావా..? అంటూ కూసింత గట్టిగానే అరిచాడు. ” అయితే ఇది టిఆర్పి రేటింగ్ కోసం చేసిన స్టంట్ నా..? లేకపోతే నిజంగానే శేఖర్ మాస్టర్ హర్ట్ అయ్యాడా ..? అన్నది పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే. మరి కొందరు మాత్రం యాంకర్ శివ పై ఫైర్ అవుతున్నారు. ఎంత టిఆర్పి రేటింగ్స్ కోసం అయితే ఆయన పర్సనల్ మ్యాటర్ ని అలా అడగడానికి సిగ్గుండాలిగా అంటున్నారు . ప్రమోషన్స్ కోసం ఇలా కూడా చేస్తారా ఇలా చేస్తే టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయా..? అంటూ ఫైర్ అవుతున్నారు..!!