సలార్ సెకండ్ డే కలెక్షన్స్ : కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా.. మొత్తం ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే..!

సలార్ ఇప్పుడు ఈ పేరు వైరస్ ల అందరికీ పాకేసింది. టాలీవుడ్ రెబల్ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమానే ఈ సలార్ . సలార్ అంటే అర్థం సమర్థవంతమైన నాయకుడు . సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ పెట్టి టైటిల్ హిట్ కొట్టేశాడు ప్రశాంత్ నీల్. కాగా కే జి ఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

కాగా సలార్ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఎంతలా అంటే చూసిన జనాలే మళ్లీమళ్లీ థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూస్తున్నారు. ఈ క్రమంలోని సలార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డుని సొంతం చేసుకున్న ప్రభాస్ ..డే 2 లో కూడా అదే ర్యాంపేజీ చూపించాడు .

కాటేరమ్మ కొడుకుగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసేసాడు. సలార్ సినిమా రెండో రోజు ఏకంగా 150 కోట్లు రాబట్టిన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .డే 1 ని పక్కన పెడితే 2023లో రిలీజ్ అయిన మిగిలిన అన్ని సినిమాల ఓపెనింగ్ డే కన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబడినట్లు తెలుస్తుంది. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినాకు ఇది నిదర్శనం అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఈ సినిమా వెయ్యి కోట్లు ఈజీగా దాటేస్తుంది అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి . దీంతో బాక్సాఫీస్ వద్ద సలార్ బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది..!!