2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Standees war between Veera Simha Reddy and Waltair Veerayya | cinejosh.com

2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి దిగాడు. ఈ సినిమాకు పోటీగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలకు మధ్యన మంచి హోరాహోరీ పోటీ నడిచింది. బాబి డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య కామెడీ టైమింగ్ అదిరిపోవడంతో చిరు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్, మాస్ మహారాజ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక 2022లో ఆచార్య ఫెయిల్యూర్ అయిన వాల్తేరు వీరయ్య తో విజయోత్సహాన్ని నింపుకున్నాడు చిరంజీవి.

ఇక పొంగల్‌కి ఎప్పుడు వ‌చ్చిన‌ హిట్ తన ఖాతాలో వేసుకునే హీరో బాలకృష్ణ.. గోపీచంద్ మల్లి డైరెక్షన్లో వచ్చిన వీర‌సింహారెడ్డి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇలా ఈ ఏడాది సంక్రాంతి బరిలో గట్టి పోటీకి దిగిన ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నారు. ఇది 2023 కి చాలా మంచి స్వాగతం అని చెప్పవచ్చు. ఇక జనవరిలో వచ్చిన జోరు ఫిబ్రవరి నుంచి అసలు కనిపించలేదు నెలలు మారుతున్న కొద్ది మంచి సినిమాలు మినహా బాక్సాఫీస్ రికార్డులు కల్లగట్టిన సినిమాలు ఏవి 2023లో లేవు. భారీ అంచనాలతో వచ్చి కొన్ని సినిమాలు కనుమరుగైపోయాయి.

ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఏ సినిమా లాభం ఎంతో మీకు తెలుసా -  Highest Profitable Movies In 2023 Waltair Veerayya Balagam Sir Baby  Virupaksha Details

అసలు ఎలాంటి చప్పుడు లేకుండా వచ్చిన కొన్ని చిన్న సినిమాలు మాత్రం భారీ బ్లాక్ బాస్టర్ లుగా నిలిచాయి. కలర్ ఫోటో ఫ్రేమ్ సుహాస్ హీరోగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణమ్‌ ఫిబ్రవరిలో రిలీజ్ అయి ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుంది. క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ గట్టిగా పడటంతో కలర్ ఫోటో తర్వాత సుహాస్ ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ చేరింది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ధనుష్, సంయుక్త మీన‌న్‌ జంటగా నటించిన సార్ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ధనుష్ నటించిన మొదటి తెలుగు స్ట్రైట్ మూవీ ఇదే కావడం విశేషం.

ఇక అలాగే అంచ‌నాలేవి లేకుండా కామ్ గా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ కూడా ఒకటి. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం నటించాడు. ఇక ఈ ఏడాది మార్చిలోనే నాని దసరా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తరువాత మంచి సక్సెస్ అందుకుంది. కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో వచ్చిన రంగమార్తాండ కూడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కమెడియన్ వేణు దర్శకత్వంలో పక్కా తెలంగాణ యాసతో ఆచార వ్యవహారాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించిన మూవీ బలగం. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ సినిమా నిలిచింది.

Balagam (film) - Wikipedia

స్టోరీలో కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ అందుకుంటుంది అనడానికి ప్రధాన ఉదాహరణగా నిలిచింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన విరూపాక్ష, సాయి ధరంతేజ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచింది. ఇక మే నెలలో శ్రీ విష్ణు హీరోగా నటించిన సామజవరగ‌మన సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ద్వారా హిలోరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక తర్వాత నెలలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది.

అతి తక్కువ బడ్జెట్ తో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక అదే నెలలో రజనీకాంత్ నటించిన జైల‌ర్‌ సినిమా రిలీజ్ అయి అదరగొట్టింది. సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ సమంత జంటగా వచ్చిన ఖుషి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సంక్రాంతి రేసులో సత్తా చాటిన బాలకృష్ణ మరోసారి దసరా రేసులో అడుగు పెట్టాడు. భగవంత్ కేసరి సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలయ్య.

Bhagwant Kesari USA Collections

ఈ సినిమా తర్వాత వచ్చిన కీడాకోలా, పొలిమేర 2 సినిమాలు కూడా చిన్న సినిమాలు అయినా మంచి సక్సెస్ అందుకుని గట్టి కలెక్షన్లను అందించాయి. ఇక చివరిగా డిసెంబర్లో నాని హాయ్ నాన్న వచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. ఫినిషింగ్ టచ్ గా డైనోసార్ రంగంలోకి దిగాడు. స‌లార్ సినిమాతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ బరిలో దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ బ్రహ్మ రథం పడుతుంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

Salar teaser : అనుకున్నంతగా ఏం లేదు.. అంటూ తేల్చేసిన నెటిజన్లు | Netizens  concluded that Salaar teaser is not as expected