నాగ్ ” నా సామి రంగ ” మూవీ రిలీజ్ డేట్ పక్కా ఫిక్స్.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామిరంగ ” పై నాగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నాగార్జున మరో విలేజ్ డ్రామా ఇది కావడం పైగా ఇది కూడా ఒక సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ లా అనిపించడంతో అందరిలో మంచి హైప్ ఏర్పడింది.

ఇక దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం అంతిమ దిశ పనుల్లో ఉండగా.. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్డేట్ వినిపిస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ జనవరి 14న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అలాగే 7వ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.